పోలీస్ స్టేషన్ లలో కొక్కొరొకో... కొక్కొరొకో...!

సంక్రాతికి ఏ ఆచారం మర్చిపోయినా ఒక్కటి మాత్రం మరువనే మరువరు కొందరు , అదేదో కాదు కోడిపందేలు ! .పోలీస్ భయం నాయకులు చూసుకుంటారనే ధీమాతో చాలాచోట్ల యదేశ్ఛగా జరుగుతున్నాయి .సాధారణంగా కనుమరోజున జరిగే ఈ పందేలు ఈ ఏడాది తొలి రోజునుంచే మొదలయ్యాయి.రాష్ట్రంలో కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు కూడా హజరువుతుండం ఏటా జరిగే విశేషమే ,ఐతే ఈసారి తెలంగాణా ,ఆంధ్రా ఎమ్మ్మెల్యేలు కలసి పశ్చిమగోదావరిలో జరిగిన పందేలకు హాజరవడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.ఇన్నళ్ళూ ఉద్యమాలతో తిరిగిన ఎమ్మేల్యేలు ఇలా పండగ సందర్బంగా కలవడం మంచిదే ఐతే ఇలా మూగజీవుల ఉసురు తీసే కార్యక్రమంలో హాజరవడం విచరించాల్సిందే.దాదాపు 50 కోట్ల పందేలు జరిగాయి !
కొన్ని సార్లు ఎవరు చెప్పినా పోలీసులు వినరు ,కొన్ని ప్రాంతాల్లో ఈ పందెలరాయుళ్ళను,కోళ్ళను కూడా స్టేషన్లో పెట్టారు .పాపం ఈగొడవలేమీ తెలియని కోడిపుంజులు కొక్కొరొకో... కొక్కొరొకో... అని పోలీస్ స్టేషన్లొ అరుస్తున్నాయి .మరో రెండురోజులవరకూ పోలీసులకు ఈ కోళ్ళు సుప్రభాతసేవ చేస్తాయనడంలో సందేహం లేదు ! .

No comments:

Post a Comment