"బ్రహ్మ ముడి” వ౦టక౦ తయారీ


అయ్యో ! దానికే౦ భాగ్య౦ ! ! అనలేను ఎ౦దుక౦టే నాకు వ౦టలు తినట౦ ఇష్ట౦

చేయట౦కాదు.కానీ ఇలా 3 గ్గురు (!) అడిగాక కాద౦టే తప్పు కదా.అ౦దుకే ఇలా రాస్తున్నాను. ఆ బ్రహ్మముడి పటములు కూడా జతపరుస్తున్నాను చిత్తగి౦చ౦డి.ఒక విన్నప౦ నన్ను FOllow అవచ్చుగా!

వ౦టక౦ పేరు: బ్రహ్మ ముడి

కావలిసిన పధార్ధాలు: మైదా 1/4 K.G, చక్కెర 1/2 K.G నూనె 50 Grams సోడాఉప్పు 1-2 Spoons

తయారీ:

మైదాపి౦డిని,సోడాఉప్పు ,కొద్దిగానూనె వేసి చపాతి పి౦డిలా కలుపుకోవాలి.

చపాతి పి౦డిలా కలిపాక ఇ౦కే౦చేస్తా౦ చపాతీలా చేయ౦డి.! వాటిని ముక్కలుగా చిత్ర౦లో చూపినట్లుకట్ చేసి చిన్నముడిలా చుట్టి నూనెలో డీప్ ఫ్రై చేయాలి.

ఇక చక్కెర మిగిలివు౦దిగా ! .

దానిని పాన్ లో పోసి తీగపాక౦ వచ్చేవరకూ వు౦చి ఆ డీప్ ఫ్రై చేసిన బ్రహ్మముడిని పాక౦లో వేయాలి.

ఆ౦తే!

ఇక ఓపికవు౦టే చేసుకొని తిని అభిప్రాయ౦ రాస్తే స౦తోషిస్తా౦!.

బ్రహ్మ ముడి వ౦టక౦ ! !

నమస్కార౦ !

రో జు (24jan 2011) (12noon) మా టివి లొ బ్రహ్మ ముడి వ౦టక౦ చూసాక నాకు ఏడడుగులు అనే వ౦టక౦ కూడా ఉ౦టే బాగు౦డనిప౦చి౦ది.

ఏడడుగులు వ౦టక౦ తిన్న వాళ్ళు ఏడడుగులు క౦టే ఎక్కువ వేయలేరని వెరే చెప్పాలా మీకు.

To day is National Voters Day-

Even if you ignore politics, they never ignore you.

కిలోగ్రాం సన్నబడింది !


అవును ఏ డైటింగులు చేయకుండానే,వ్యాయమం లేకుండానే కే.జీ ఏబై మైక్రో గ్రాంలు తగ్గిపోయింది.

మనకు ప్రామాణికమైన కే.జీ కి మూలం ప్లాటినం-ఇరిడియం లతో ఏర్పరిచిన ఒక ఆకృతియొక్క బరువుకు సమానం.ఇది ఫ్రాన్స్ లో ఉన్న International Bureau of Measurements (BIPM) లో భధ్రపరచబడింది.కానీ ఇది1960 లో నిర్ణయించబడింది.దీన్నే ఇన్నాళ్ళూ పాటిస్తూ వచ్చారు.కానీ ఇది గడ్డిబరువుకు సమానమైన ఏబై మైక్రోగ్రాంలు తగ్గిపోయిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.అందుకే దీనిపై ఒకనిర్ణయం తీసుకోవడానికి ఈరోజు అనగా 24jan2010 న లండన్ లోని రాయల్ సొసైటీ లో సమావేశమవుతున్నారు.క్వాంటం ఫిజిక్స్ లో ప్రామాణికమైన ఫ్లాంక్ కాన్స్టెంట్ కు సరిదిద్దాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈనాడు_కామనాడు AND అసలు మొబైల్ నంబర్ పోర్టబులిటీ (MNP )గురించి తెలుసా వీళ్ళకు ???

20-1-2011 ఈనాడులో టెన్నిస్ తారల ఫోటోలు బాగానేఉంది కానీ సానియామీర్జా ఎదలు ఫోటోషాప్ లో అంతగా liquify చేయాలా ??? ఈనాడు ఏమైందినీకు??? కామనాడు అవుదామనా?

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
***************************************************************************

మొబైల్ నంబర్ పోర్టబులిటీ సందర్భంగా ఈరోజు( 20-jan-2011) అంధ్రజ్యోతి నవ్య పేజీలో
వచ్చిన "నేటి నుంచీ మీ నెంబర్ మీదే "చూసాక నవ్వాగలేదు.అంటే దానర్దం అంతబాగా నవ్వువచ్చేలా రాసారని కాదు మన తెలుగు పేపర్లు ఇంత ఛెండాలంగా ఎలా రస్తాయని డోకొచ్చింది.
అసలు మొబైల్ నంబర్ పోర్టబులిటీ (MNP )గురించి తెలుసా వీళ్ళకు అనిపించింది.కొత్తగా వచ్చిన ఈ సదుపాయాన్ని వినోదభరితంగా చెప్పలంటే ఇదా మార్గం??? అసలు మొబైల్ నంబర్ పోర్టబులిటీ అంటే జనాల్లోకి వేరే అర్ధం పోయింది ఈరాతలు చూసి.

మొబైల్ నంబర్ పోర్టబులిటీ గూర్చి వినోదంగా రాయలంటే నాకున్న పరిధిలో రాస్తాను చిత్తగించడి.
************************************************************
భార్య:పక్క కంపెనీ ఆఫర్స్ అదిరేలా ఉంటే మన నెంబర్ మారకుండా ఆ ఆఫర్స్ అందుకో వచ్చటగా, ఆ కంపెనీ సిం తీసుకున్నా మన నెంబర్ మారదటగా మొబైల్ నంబర్ పోర్టబులిటీ తో!
భర్త:అన్నింటికి అలాంటి సౌకర్యం ఉండదు కదా!
*************************************************************
1వ వ్యక్తి : మొబైల్ నంబర్ పోర్టబులిటీ వచ్చింది కదాని వెంటనే మార్చాను (దిగులుగా)
2వ వాడు:మరి భాద దేనికి?
1వ వ్యక్తి :ఆ పాత దాంట్లో బ్యాలేన్స్ అంతా ఇందులోకి రాదట , లాప్స్ అవుతుందట!
**************************************************************
P.S:చివరికి 'కొ..కా' కూడా రాసేసారు ఏదో ఎమోషన్ క్రియేట్ చేద్దమనుకున్నారు కాని ఛీ ... బాలేదు.
నా ఉద్దేశ్యం విమర్శిచడమో లేక నా గొప్పతనాన్ని చెప్పుకోవడమో మాత్రం ఖచ్చితంగా కాదు. నా అభిప్రాయం ఇదీ అని తెల్పడమే.

పోలీస్ స్టేషన్ లలో కొక్కొరొకో... కొక్కొరొకో...!

సంక్రాతికి ఏ ఆచారం మర్చిపోయినా ఒక్కటి మాత్రం మరువనే మరువరు కొందరు , అదేదో కాదు కోడిపందేలు ! .పోలీస్ భయం నాయకులు చూసుకుంటారనే ధీమాతో చాలాచోట్ల యదేశ్ఛగా జరుగుతున్నాయి .సాధారణంగా కనుమరోజున జరిగే ఈ పందేలు ఈ ఏడాది తొలి రోజునుంచే మొదలయ్యాయి.రాష్ట్రంలో కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు కూడా హజరువుతుండం ఏటా జరిగే విశేషమే ,ఐతే ఈసారి తెలంగాణా ,ఆంధ్రా ఎమ్మ్మెల్యేలు కలసి పశ్చిమగోదావరిలో జరిగిన పందేలకు హాజరవడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.ఇన్నళ్ళూ ఉద్యమాలతో తిరిగిన ఎమ్మేల్యేలు ఇలా పండగ సందర్బంగా కలవడం మంచిదే ఐతే ఇలా మూగజీవుల ఉసురు తీసే కార్యక్రమంలో హాజరవడం విచరించాల్సిందే.దాదాపు 50 కోట్ల పందేలు జరిగాయి !
కొన్ని సార్లు ఎవరు చెప్పినా పోలీసులు వినరు ,కొన్ని ప్రాంతాల్లో ఈ పందెలరాయుళ్ళను,కోళ్ళను కూడా స్టేషన్లో పెట్టారు .పాపం ఈగొడవలేమీ తెలియని కోడిపుంజులు కొక్కొరొకో... కొక్కొరొకో... అని పోలీస్ స్టేషన్లొ అరుస్తున్నాయి .మరో రెండురోజులవరకూ పోలీసులకు ఈ కోళ్ళు సుప్రభాతసేవ చేస్తాయనడంలో సందేహం లేదు ! .

సంక్రాంతి శుభాకాంక్షలు !

సంక్రాంతి శుభాకాంక్షలు !
మన ఆచారాలను పాటించండి,గౌరవించండి.ఎందుకంటే మన మనుగడకు అవే
మూలాధారం.మన సాంప్రదాయేలే మనం మన ముందుతరాలకు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి.చలి కాచుకోవడానికే ఐతే మనం ఇంట్లోనే దుప్పట్లు కప్పుకోవచ్చు నలుగురితో కలసి వెచ్చదనాన్ని పంచుకోవడం ,ముంగిళ్ళలో రంగవల్లులను అలంకరణ,కళాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించడం ,గతించిన మన పెద్దవాళ్ళను గుర్తుకు తెచ్చుకోవడం ,
సంవత్సరం పొడవునా మనకు వ్యవసాయంలో సేవలను చేసే మూగజీవాలను
పూజించడం. ఇవన్నీ మనకు అనాధిగా వస్తున్నవే.ఇవి ఏ Blue cross లు లేని నాటినుంచే మనకు తెలిసినవి.
అందరూ ఆనందంగా ఉండాలని మన:స్పూర్తిగా కోరుకుంటున్నాను.

సాక్షి లో పెయిడ్ news

నానో ఉత్పత్తి పెంచినట్టు ఉంది,గుజరాత్ లోని సనంద్ ప్లాంట్ ఉత్పత్తి పూర్తి సామర్ధ్యానికి చేరుకోవడంతో ఇక తన ఉత్పత్తులను
వీలైనంత త్వరగా అమ్ముకోజూస్తోంది. రూ.99/-కే సర్వీస్ మెయింటెనెన్స్ మొదలైన ఆఫర్స్ ఇస్తోంది .విషయం ఏమిటంటే "పెయిడ్ news" ను ప్రోత్సహిస్తోంది.
సాక్షి లో గత 3 రోజులుగా(7,9,10.. jan2011) వస్తున్న profit page ను చూస్తే మీకే తెలుస్తుంది.మిగతా వాటికంటే ఇందులోకాస్త మోతాదు ఎక్కువైంది